Header Banner

శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో భారీ ఎర్రచందనం పట్టివేత! కోట్లు విలువైన దుంగలు స్వాధీనం!

  Mon Apr 28, 2025 19:40        Others

శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. లారీ, కారుతో సహా రూ 2.5 కోట్ల విలువగల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులకు దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో పంగూరు మెయిన్ రోడ్డు దొమ్మరపాళెం వద్ద వాహనాలు తనిఖీ చేపట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులకు స్మగ్లర్లు పట్టుబడ్డారు. తప్పించుకునే ప్రయత్నం చేసిన స్మగ్లర్లు అడ్డంగా దొరికిపోయారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ వద్ద వాహనాల తనిఖీ సమయంలో ఆపకుండా వేగంగా వెళ్ళిన లారీ, కారును అనుమానంతో వెంబడించారు. ఛేజ్ చేసి పట్టుకున్నారు.

వాహనాలను వదిలి పారిపోయే ప్రయత్నం చేసిన ఏడుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. అందులో ఉన్న ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న రెడ్ శాండిల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. లారీతో సహా కారును కూడా సీజ్ చేసారు. రూ. 2.5 కోట్ల విలువ గల 72 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాకు నలుగురు, తమిళనాడుకు చెందిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలు, దొంగలతో పాటు లారీ కారును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు.


ఇది కూడా చదవండిశుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #RedSandalwood #Srikalahasti #ForestRaid #SmugglingBust #TaskForceSuccess #RedSandalwoodSeizure